logo

విశాఖ సాహితి

'సహితస్య భావం సాహిత్యం' - సమాజ హితాన్ని కోరుతూ సృజించబడేది సాహిత్యం. మానవులకు మానసికమైన ఆనందంతో పాటు, వ్యవహార జ్ఞానాన్ని చేకూర్చే సుధారసం సాహిత్యం. అట్టి సాహిత్య విషయంలో "ఎలాంటి వివాదాలకు తావులేకుండా వివిధ భావవాదాలకు వేదిక" గా ప్రముఖ రచయిత అంగరవెంకట కృష్ణారావు గారి శుభ సంకల్పంగా 04-04-1971, ఉగాది రోజున 'విశాఖ సాహితి' ఆవిర్భవించింది.

కళాప్రపూర్ణ శ్రీ గజపతిరాజు అచ్యుతరామరాజుగారు గౌరవాధ్యక్షులుగా ప్రసిద్ధ నవలాకారులు శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావుగారు అధ్యక్షులుగా, కథకులు శ్రీ మల్లాప్రగడ రామారావుగారు కార్యదర్శిగా రూపుదిద్దుకున్న ఈ విశాఖ సాహితికి 'వాక్యం రసాత్మకం కావ్యం' అనే రమణీయమైన సూక్తితో సుప్రసిద్ధ చిత్రకారులు బాపుగారు అర్ధవంతమైన చిహ్నాన్ని (లోగో) చిత్రించారు మనోహరంగా. 

1977 నుండి కళాప్రపూర్ణ శ్రీ గజపతిరాజు అచ్యుతరామరాజుగారు అధ్యక్షులుగా, సుప్రసిద్ధ కథకులు శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, శ్రీ భరాగో, శ్రీ కోశానా, శ్రీ నవులూరు వెంకటేశ్వరరావు, శ్రీ ఏ.యస్వీ.రమణారావు, ష్టి శ్రీహరిరాజు, శ్రీ జంపన కుమారవర్మ, శ్రీ కావిలిపాటి నారాయణరావు ప్రభృతులు కార్యదర్సులుగా విశాఖ సాహితి కార్యక్రమాలను ఉన్నతంగా నడిపించారు. 


విశాఖ సాహితి ధ్యేయం:

తెలుగు భాషాసాహిత్యాల వారసత్వాన్ని పరిరక్షిస్తూ, ఆధునిక సాహిత్య ధోరణులు ఆహ్వానిస్తూ, మానవీయ విలువలు గల రచనలను ప్రోత్సాహించడం.

విశాఖ సాహితి లక్ష్యాలు:

  • సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, విద్యా, సాంకేతిక, వైజ్ఞానిక విషయాలకు వేదిక కావడం.
  • ఔత్సాహిక రచయితలను ప్రోత్సాహించడం, తగు సలహాలను అందించడం.
  • ప్రామాణిక రచనలను ప్రచురించడం.
  • కనుమరుగవుతూన్న మన జానపద కళారూపాలను గురించిన విశేషాలను సేకరించి, ఆయా కళాకారులను ప్రోత్సాహించడం.
  • ప్రసిద్ధ సాహితీమూర్తులు గౌరవించడం, వారి ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం.
  • ప్రాచీన, నవీన సాహిత్యాలలోని ప్రక్రియలన్నింటికీ సమ ప్రాధాన్యమిస్తూ సభలు నిర్వహించడం.
  • ప్రపంచ సాహిత్య అనువాదాలను ప్రోత్సహించడం. వివిధ పురస్కారాలను గెలుచుకున్నవారిని సన్మానించడం.
  • వారం వారం సభల నిర్వహణలో:
    • పుస్తకావిష్కరణలు
    • ఆయా కవుల జయంతులు, వర్ధంతుల నిర్వహణ
    • కవి సమ్మేళనాలు
    • కథా కచేరీలు
    • యువతకు పోటీలు, క్విజ్ లు నిర్వహించడం
    • భారత, భాగవత, రామాయణాలపై ఉపన్యాసాలు
    • నాటకాలు, రూపకాలు, హరికథలు, అవధానాలు-అష్టావధానం, సంగీతావధానం, శతావధానాల నిర్వహణ, రూపకాల ప్రదర్శనలు
    • స్మారకోపన్యాసాలు
    • స్వాతంత్య్ర దినోత్సవ, గణతంత్ర దినోత్సవ, మాతృ భాషా దినోత్సవ, మహిళా దినోత్సవ, పృథ్వీ దినోత్సవ, పర్యావరణ దినోత్సవ, మాతృ దినోత్సవ, బాలల దినోత్సవ సభలు జరపడం.

ఛాయా చిత్రాలు